Rahul Gandhi: మరోసారి తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఈసారికూడా ఎన్నికల ప్రచారంకోసమే!

సింగరేణిలో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) మ్యానిఫెస్టోను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ...

Rahul Gandhi

Singareni Elections : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఈనెల 27న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సింగరేణిలో నాలుగు సార్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), రెండు సార్లు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లు గుర్తింపు కార్మిక సంఘం హోదాలో కొనసాగాయి. ప్రస్తుతం ఏడోసారిజరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయంకోసం సంఘాలు పోటీ పడుతున్నాయి.

Also Read : Amit Shah : మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై వీడని ఉత్కంఠ.. ప్రతిపక్షాలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!.. అదే జరిగితే కొత్త వ్యక్తులకే సీఎం పీఠాలు?

సింగరేణిలో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) మ్యానిఫెస్టోను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో విస్తరించిన కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఐఎన్టీయూసీ తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కోల్ బెల్ట్ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారని, పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కార్మిక సమస్యల పరిష్కారంపై భరోసా కల్పిస్తారని మంత్రి వెల్లడించారు.

Also Read : Telangana Polls to Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

గతనెల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పలు దఫాలుగా తెలంగాణలో పర్యటించారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్, సోనియా, ప్రియాంకలు హాజరయ్యారు. మరోసారి సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. అయితే, ఈసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణలో అడుగుపెట్టనున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు