Amit Shah : మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై వీడని ఉత్కంఠ.. ప్రతిపక్షాలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!.. అదే జరిగితే కొత్త వ్యక్తులకే సీఎం పీఠాలు?

ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని ...

Amit Shah : మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై వీడని ఉత్కంఠ.. ప్రతిపక్షాలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!.. అదే జరిగితే కొత్త వ్యక్తులకే సీఎం పీఠాలు?

modi and amit shah

Rajasthan – madhya Pradesh – Chhattisgarh : గతనెలలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. ఈనెల మొదటివారంలో వెలువడిన ఫలితాల్లో తెలంగాణ, మిజోరం రాష్ట్రాలు మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే, ఫలితాలు వెలువడి వారం రోజులు అవుతున్నా ఆ రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రాష్ట్రాల్లో పలుపేర్లు తెరపైకి వస్తున్నా వాటిని అధిష్టానం ధృవీకరించడం లేదు. దీంతో ఇటు కాంగ్రెస్ తో పాటు అటు దేశంలోని ప్రధాన పార్టీల నుంచి బీజేపీ విమర్శలు ఎదుర్కొంటుంది. మరోవైపు బీజేపీ అధిష్టానంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ విమర్శకులకు కౌంటర్ అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

Also Read : Ayodhya Ram temple : రామమందిరం నిర్మాణంతో అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు

మనవరాళ్లతో చెస్ ఆడుతూ..
మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను ప్రకటించక పోవటంతో బీజేపీపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన మనవరాళ్లతో కలిసి చదరంగం ఆడుతున్న ఫొటోను షేర్ చేశారు. దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఒక మంచి ఎత్తుగడతో ఆగిపోకండి.. ఎప్పటికీ ఉత్తమైన దానికోసం చూడండి అంటూ అమిత్ షా పేర్కొన్నారు. దీంతో ఆ పోస్టు ఆసక్తికరంగా మారింది. సీఎంల ఎంపికలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ విమర్శలకు కౌంటర్ గానే అమిత్ షా ఈ పోస్టు చేశారని పలువురు భావిస్తున్నారు.

Also Read : Danish Ali Suspended From BSP: ఎంపీ డానిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. బెడిసికొట్టిన కాంగ్రెస్‭ స్నేహం!

కొత్తవారికే అవకాశం?
ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని సీఎం ఎంపికకు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, హైకమాండ్ జాప్యం ఆయా రాష్ట్రాల్లోని సీనియర్ నేతలకు గుబులు పుట్టిస్తోంది. ఇందుకూ ఓ కారణం ఉంది. బీజేపీ అధిష్టానం సీఎం ఎంపికకు ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే పార్టీ పాత వ్యక్తుల కంటే కొత్త వ్యక్తిని సీఎంగా చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తుందన్న వాదన ఉంది. ఇలాంటి ఉదాహరణలు గతంలోనూ చోటు చేసుకోవటంతో సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఉదాహరణకు.. 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి బీజేపీ అధిష్టానంకు తొమ్మిది రోజులు పట్టింది. ఆ సమయంలో రాజ్ నాథ్ సింగ్, మనోజ్ సిన్హా వంటి పెద్దలు సీఎం రేసులో ఉన్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం కొత్తగా వచ్చిన యోగి ఆధిత్యనాథ్ కు సీఎం పీఠాన్ని అప్పగించింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ 2017, మహారాష్ట్ర 2014లలో సీఎం ఎంపిక కోసం బీజేపీ హైకమాండ్ ఏడు రోజులు సమయం తీసుకుంది. రెండుచోట్లా బీజేపీ పాత వ్యక్తులను తిరస్కరించి కొత్తవారికి సీఎం పీఠాన్ని కట్టబెట్టింది. ఇలా గతంలో జరిగిన పలు ఉదాహరణలను ఆ మూడు రాష్ట్రాల బీజేపీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడి వారం రోజులు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ హైకమాండ్ తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త సీఎంలు వస్తారన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

 

 

 

View this post on Instagram

 

A post shared by Amit Shah (@amitshahofficial)