Danish Ali Suspended From BSP: ఎంపీ డానిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. బెడిసికొట్టిన కాంగ్రెస్‭ స్నేహం!

సెప్టెంబరు 2023లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు మద్దతు పలికారు

Danish Ali Suspended From BSP: ఎంపీ డానిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. బెడిసికొట్టిన కాంగ్రెస్‭ స్నేహం!

లోక్‭సభ సభ్యుడు డానిష్ అలీని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ సుప్రెమో మాయావతి చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయవద్దని ఆయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పానని, అయినప్పటికీ పార్టీపై నిరంతరం ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నానని బీఎస్పీ విడుదల చేసిన ప్రకటనలో ఆమె తెలిపారు.

బీఎస్పీ ప్రకటన
2018లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు చెందిన జనతా దళ్ సెక్యూలర్ పార్టీ సభ్యుడిగా డానిష్ అలీ పని చేశారు. అయితే 2018లో జరిగిన కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, జనతా పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో దేవెగౌడ పార్టీ తరపున డానిష్ అలీ చాలా యాక్టివ్‌గా పని చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం.. హెచ్‌డీ దేవెగౌడ అభ్యర్థన మేరకు డానిష్ అలీని అమ్రోహా నుంచి బీఎస్పీ టికెట్ ఇచ్చి అభ్యర్థిగా పోటీకి దింపారు.

అమ్రోహా నుంచి బీఎస్పీ టికెట్
అదే ప్రకటనలో.. “డానిష్ అలీకి టిక్కెట్ ఇవ్వడానికి ముందు, బహుజన్ సమాజ్ పార్టీ విధానాలను ఎల్లప్పుడూ అనుసరిస్తానని, పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తానని హెచ్‌డీ దేవెగౌడ హామీ ఇచ్చారు. ఈ హామీకి డానిష్ కూడా అంగీకరించి ప్రమాణం చేశారు. ఆ తర్వాతనే అలీకి BSP సభ్యత్వం ఇచ్చాము’’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: దేశంలో మళ్లీ కరొనా కలకలం.. తాజాగా 148 మందికి పాజిటివ్

అయితే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి విడుదల చేసిన ప్రకటనలో మాయావతి ఆరోపించారు. సెప్టెంబరు 2023లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. శుక్రవారం (డిసెంబర్ 8) నాడు టీఎంసీ నాయకుడు మహువా మొయిత్రాకు అనుకూలంగా డానిష్ అలీ కూడా పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు.