Congress leaders clashed in front of Bhaggumanna Gandhi Bhavan
Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్లు, కుమ్మలాటలు తగ్గడం లేదు. ఇవి ఎక్కువై పార్టీ నష్టపోతుందనే అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయ్ సింగ్ ఎదుటే తగువాలటకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై ఎన్ఎస్యూఐకి చెందిన ఉస్మానియా విద్యార్థి నేతలు దాడికి పాల్పడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తావా అంటూ బూతులు తిడుతూ కొట్టే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో సేవ్ కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దిగ్విజయ్ ఉన్నది కూడా పట్టించుకోకుండా ఒకరికొకరు గల్లాలు పట్టుకున్నారు.
Maha vs Karnataka: సంజయ్ రౌత్ చైనా ఏజెంట్.. రౌత్ ‘చైనా తరహా’ వ్యాఖ్యలపై భగ్గుమన్న కర్ణాటక సీఎం
గాంధీ భవన్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్ఎస్యూఐ నేతలు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్ కుమార్‌పై దాడికి దిగారు. ఈ ఘటనపై దిగ్విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని విషయాలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్తామని, ఓయూ విద్యార్థుల అంశాలు పార్టీ దృష్టిలో ఉన్నాయని అన్నారు.