Rajagopal Reddy : ఆగస్టు 7న బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నా ఫలితం దక్కడం లేదు. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆగస్టు 7న హస్తానికి హ్యాండిచ్చి..కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డితో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా చర్చలు జరిపినా ససేమిరా అంటున్నారు.

MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నా ఫలితం దక్కడం లేదు. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆగస్టు 7న హస్తానికి హ్యాండిచ్చి..కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డితో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా చర్చలు జరిపినా ససేమిరా అంటున్నారు.

పార్టీని వీడేందుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా మునుగోడు ఉపఎన్నికే కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఉపఎన్నికతో మునుగోడును డెవలప్ చేయడం, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడమే తన ఎజెండా అన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు మునుగోడులో పర్యటిస్తానని తెలిపారు.

Eetela Rajender : రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా-ఈటల రాజేందర్

మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు కంచుకోట అని.. దాన్ని కాపాడుకుంటామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం.. పార్టీ అంతర్గత విషయమన్న ఆయన.. ఉత్తమ్‌ సహా పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. చిన్న చిన్న అంశాలపై మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని రేవంత్‌ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు