Eetela Rajender : రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా-ఈటల రాజేందర్

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని ఈటల రాజేందర్ అన్నారు.

Eetela Rajender : రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా-ఈటల రాజేందర్

Eetela Rajender

Eetela Rajender : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ లో తన గెలుపును రాజగోపాల్ రెడ్డి కోరుకున్నారని ఈటల చెప్పారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని ఈటల రాజేందర్ అన్నారు.

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది : ఉత్తమ్

ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించే బాధ్యతను హైకమాండ్ తనకు అప్పచెప్పిందని తెలిపారు.

Komatireddy Rajagopal Reddy : ‘ఇది కేసీఆర్ పై నా యుద్ధం..ఎవ్వరి మాటా వినేదేలే..రాజీనామా విషయంలో తగ్గేదేలే’..

టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన నేతలు తనతో టచ్ లో ఉన్నారని… త్వరలోనే ఊహకు అందనంత స్థాయిలో చేరికలు ఉంటాయని ఈటల బాంబు పేల్చారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతో కాలంగా తనకు మంచి మిత్రుడని… ఆయన బీజేపీలో చేరడం పక్కా అని అన్నారు. హుజూరాబాద్ ప్రజల కాలికి ముళ్లు గుచ్చుకుంటే నోటితో పీకే వ్యక్తి ఈటల అని చెప్పారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw