Komatireddy Rajagopal Reddy : ‘ఇది కేసీఆర్ పై నా యుద్ధం..ఎవ్వరి మాటా వినేదేలే..రాజీనామా విషయంలో తగ్గేదేలే’..

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో ఎవ్వరిమాటా వినేదేలేదంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజీనామా చేస్తానని..మునుగోడుకు ఉప ఎన్నిక రావటం ఖాయం అని తెలిపారు.

Komatireddy Rajagopal Reddy : ‘ఇది కేసీఆర్ పై నా యుద్ధం..ఎవ్వరి మాటా వినేదేలే..రాజీనామా విషయంలో తగ్గేదేలే’..

Komatireddy Rajagopal Reddy

Updated On : July 30, 2022 / 1:04 PM IST

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ ను పార్టీ మారకుండా బుజ్జగించటానికి పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టినా రాజగోపాల్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు. పార్టీలో ఉండేదే లేదు..ఎవ్వరి మాటా వినేదే లేదు..రాజీనామా చేసే విషయంలో తగ్గేదేలేదు అంటూ తనమాట మీదనే నిలబడ్డారు. రాజగోపాల్ ను పార్టీ మారకుండా చేయటానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసే ఎటువంటి బుజ్జగింపులు ఫలించటంలేదు.

Also read : Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది : ఉత్తమ్

నేను ఓ నిర్ణయానికి వచ్చాను..ఈ విషయంలో ఎవ్వరిమాటా వినేదేలేదంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..వి.హనుమంతరావులతో పాటు పలువురు సీనియర్ నేతలంతా రాజగోపాల్ కు ఎంతగానో నచ్చచెప్పారు. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనశక్తివంచనలేకుండా బుజ్జగించారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ వీడే విషయంలో ఎవ్వరి మాటా వినటంలేదు.ఏఐసీసీ ఆదేశాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ నివాసానికి వెళ్లి కొన్ని గంటలపాటు చర్చించారు. కానీ రాజగోపాల్ మాత్రం వినలేదు.తన పట్టు వీడలేదు.

Also read : Komatireddy Rajagopal Reddy : ‘సమస్యలుంటే చర్చించుకుందాం రండీ..పార్టీ మారటమెందుకు రాజగోపాల్‘ అంటూ దిగ్విజయ్ సింగ్ ఫోన్

ఈక్రమంలో రాజగోపాల్ మాట్లాడుతు..‘‘ఇది పార్టీల మధ్య జరిగే యుద్ధం కాదు..కేసీఆర్..మునుగోడు ప్రజల మధ్యా జరిగే యుద్ధం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు..తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు ఈ యుద్ధం అని..ఇదే నా చివరి యుద్ధం అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ పెట్టటానికి తాను యుద్ధం చేస్తున్నానని..మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణలో మార్పుకు నాంది అవుతుందని అన్నారు. అలాగే మునుగోడు ఉప ఎన్నిక జరిగి తీరుతుంది అంటూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే తాను పార్టీ మారుతున్నానని యుద్ధం చేస్తున్నానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Also read : Komati Reddy Rajagopal Reddy : కాంగ్రెసులో క్లైమాక్స్ కు చేరిన రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్..సస్పెన్షన్ కు రంగం సిద్ధం