Komatireddy Rajagopal Reddy : ‘సమస్యలుంటే చర్చించుకుందాం రండీ..పార్టీ మారటమెందుకు రాజగోపాల్‘ అంటూ దిగ్విజయ్ సింగ్ ఫోన్

తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయక్వం బుజ్జగింపుల పర్వం చేపట్టింది. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకుందాం ఢిల్లీకి రండీ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు.

Komatireddy Rajagopal Reddy : ‘సమస్యలుంటే చర్చించుకుందాం రండీ..పార్టీ మారటమెందుకు రాజగోపాల్‘ అంటూ దిగ్విజయ్ సింగ్ ఫోన్

Digvijay Singh Phoned To Komatireddy Rajagopal Reddy

digvijay singh phoned to komatireddy rajagopal reddy : తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయక్వం బుజ్జగింపుల పర్వం చేపట్టింది. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకుందాం ఢిల్లీకి రండీ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు. కాంగ్రెస్ ను వీడకుండా రాజగోపాల్ కు నచ్చ చెప్పేందుకు ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు యత్నించారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరేందుకే మొగ్గుచూపుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటమెందుకు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలకు సంకేతాలిస్తున్నారు. మరోవైపు బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ ఎలాగైనా రాజగోపాల్ పార్టీలోనే కొనసాగేలా చేయటానికి శతవిధాల యత్నిస్తోంది. ఆ బాధ్యతను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగి డిగ్గీ రాజా ఫోన్ చేశారు. ఢిల్లీ రండి చర్చించుకుందాం అంటూ సూచించారు. కానీ రాజగోపాల్ మాత్రం చర్చల కోసం ఢిల్లీ వెళ్లేందుకు ఇష్టపడనట్లుగా తెలుస్తోంది.

Also read : Komati Reddy Rajagopal Reddy : కాంగ్రెసులో క్లైమాక్స్ కు చేరిన రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్..సస్పెన్షన్ కు రంగం సిద్ధం

ఇటీవలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో దాదాపు రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరటం ఖరారు అయిపోయింది. ఇక లాంఛనమే తరువాయిలా ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి వెళ్లకుండా ఆ పార్టీ నాయకత్వం చర్చలు చేస్తుంది. గత 25న సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సుమారు నాలుగు గంటల పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించారు. భట్టి విక్రమార్క భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా రాజగోపాల్ రెడ్డితో బేటీ అయ్యారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలో చేరుతారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగంగానే ప్రకటించేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్స్ ఏమిటో తెలుసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ విషయమై దిగ్విజయ్ సింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించనున్నారు. ఢిల్లీకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు. బుధవారం (జులై 27,2022) రాత్రి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్ తో తెలంగాణకు చెందిన నేతలు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణికం ఠాగూర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకండా ఏం చేయాలనే విషయమై ఈ సమావేశంలో చర్చించారు.

Also read : Komatireddy Rajagopal Reddy : బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరిక ఖరారు..మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం

కాగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ పనిచేశారు.దిగ్విజయ్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు డిగ్గీని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. దిగ్విజయ్ సింగ్ తో పాటు రేవంత్ రెడ్డి, పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేరకుండా నిలువరించే బాధ్యతను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.

మరోవైపు బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ విషయమై తన అనుచరులతో చర్చిస్తున్నారు. పార్టీ మార్పుతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై అభిప్రాయాలను సేకకరిస్తున్నారు. మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయమై చర్చించినట్టుగా సమాచారం.

మరో వైపు పార్టీలో తనకు అవమానం జరిగిందని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఏ రకమైన పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుకొంటున్నారనే విషయమై కూడ దిగ్విజయ్ సింగ్ చర్చించనున్నారు.