Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది : ఉత్తమ్

ఏఐసీసీ ఆదేశం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ ను బుజ్జగించటానికి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నారు ఉత్తమ్. మరి రాజగోపాల్ కూల్ అవుతారా? లేదు తగ్గేదేలేదు అంటారా?

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది : ఉత్తమ్

Uttam Kumar Reddy Stepped In To Appease Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాక రేపుతున్నారు. బీజేపీలోకి చేరటానికి సిద్ధమైపోయిన రాజగోపాల్ పై కాంగ్రెస్ అధిష్టానం మొదట్లో సస్పెన్ష్ వేటు వేద్దామనుకుంది. కానీ అంత సీన్ లేదు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి తుమ్మితే ఊడే ముక్కులా ఉంది. ఈక్రమంలో మొదటికే మోసం వస్తుందనుకున్న కాంగ్రెస్ కాస్త వెనక్కి తగ్గింది. సస్పెన్షన్ వేటు మాట పక్కన పెట్టి రాజగోపాల్ ను బుజ్జగించే పనిలో పడింది. దీని కోసం ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రాజగోపాల్ రెడ్డికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పారు. వీహెచ్, సీఎల్పీ నేత భట్టి నుంచి చాలామందే యత్నాలు చేశారు. ఆఖరికి ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ కూడా ఆయనతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ రండి అంతర్గత విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం అంటూ డిగ్గీ రాజా రాజగోపాల్ కు ఫోన్ చేశారు.

కానీ రాజగోపాల్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు. తమ్ముడు పార్టీ మారే విషయంలో మాత్రం అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం నోరు విప్పటంలేదు. కానీ బీజేపీలోకి వెళితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా? వద్దా? అనే విషయంలో డైలమాలా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు టైమ్ తీసుకుంటున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు రాజగోపాల్ ను నచ్చ చెప్పేందుకు. పార్టీ మారకుండా ఎలాగోలా నచ్చ చెప్పాలంటూ ఏఐసీసీ ఉత్తమ్ కు బాధ్యత అప్పగించింది. దీంతో ఉత్తమ్ రంగంలోకి దిగారు. ‘రాజగోపాల్ పార్టీ మాకుండా ఆపే బాధ్యత నాది’ అంటూ భరోసా ఇచ్చేస్తున్నారు ఉత్తమ్. ఏఐసీసీ ఆదేశాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగేలా ఆయన నచ్చ చెబుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన నేత కాడంతో ఉత్తమ్ ను కాంగ్రెస్ వీడకుండా ఆయన మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో కొనసాగితే భవిష‌్యత్ ఉంటుందని కోమటిరెడ్డికి సూచిస్తున్నారు.

దీంట్లో భాగంగా ఉత్తమ్ రాజగోపాల్ తో సమావేశమయ్యారు. బుజ్జగిస్తున్నారు. నచ్చెబుతున్నారు. మరి ఉత్తమ్ ఏం చెప్పి ఆపుతారో? రాజగోపాల్ కన్విన్స్ అవుతారా? పార్టీ మార్పు ఆలోచన విరమించుకుంటారా? లేదా ఏమాత్రం తగ్గేదేలేదు అంటూ పాత పాటే పాడతారా? లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని కాస్త తగ్గి పార్టీ మార్పు ఆలోచన విరమించుకుంటారో లేదో వేచి చూడాలి.