Congress MLC Balmuru Venkat asked ACB officials to seize KTR passport
Venkat Balmoor: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuru Venkat) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ యాక్టింగ్ చూసి సినివాళ్లే ఆశ్చర్యపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. జైలుకు పోవడానికి సిద్ధం అని ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు? ఫార్ములా ఈ-కారు రేసును లొట్టపీసు కేసు అన్నది నువ్వు కాదా.. జైలుకు పోయి యోగా చేస్తా అన్నది ఎవరు..? తప్పే చేయలేదు.. సుద్దపూస అన్ని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడంటూ బల్మూరి వెంకట్ విమర్శించారు.
Also Read: KTR: కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించిన కోర్టు
కేటీఆర్ కు చట్టం తెలియదా.. అడ్వకేట్లతో ఏసీబీ కార్యాలయంకు ఎలా వెళ్తారు. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్లను ఏసీబీ అతినుతించరని తెలియదా. అధికారుల తప్పు లేదు.. నిధులు బదిలీ చేయమని చెప్పింది నేనే అని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు.. మళ్ళీ ఇప్పుడు మాట ఎందుకు మార్చారు అంటూ వెంకట్ ప్రశ్నించారు. కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆయన పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ అధికారులను కోరుతున్నానని అన్నారు.
Also Read: HMPV: భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్
కేటీఆర్ అవినీతికి అండగా నిలబడతరో తెలంగాణ సమాజం వైపు నిలబడతరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు తేల్చుకోవాలి. లోపాయకారి ఒప్పందాలు జరగకపోతే.. బీఆర్ఎస్ కు గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఎలా ఇచ్చిందని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. మా ప్రభుత్వం అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. కానీ ప్రభుత్వం నష్టపోయిన ఖజానా లెక్కలు బయటకు తీయడం కోసమే మా ప్రయత్నం అని వెంకట్ పేర్కొన్నారు.