HMPV: భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్

హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ను ఎధుర్కొనేందుకు

HMPV: భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్

Updated On : January 7, 2025 / 9:27 AM IST

HMPV Outbreak in India: చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (HMPV) భారతదేశంలోనూ కలకలం సృష్టిస్తుంది. ఈ వైరస్ కు సంబంధించిన కేసులు భారత్ లోనూ నమోదయ్యాయి. అయితే, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం వరకు భారతదేశంలో ఏడుగురు ఈ వైరస్ భారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో రెండు కేసులు నమోదు కాగా.. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఒకరికి HMPV వైరస్ సోకినట్లు నిర్దారణకాగా.. తాజాగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ గా తేలింది. ఏడేళ్లు, 13 ఏళ్ల చిన్నారులు ఇద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Also Read: Damodara Raja Narasimha : HMPV అనేది కొత్త వైరస్ కాదు, భయపడాల్సిన అవసరం లేదు- మంత్రి దామోదర రాజనర్సింహ

హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ను ఎధుర్కొనేందుకు కొవిడ్ -19 సమయంలో అనుసరించిన విధంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు మార్గదర్శకాలను జారీ చేశాయి. హెచ్ఎంపీవీ వైరస్ 2001 నుంచి ఉన్న వైరస్ అని ఆందోళన అవసరం లేదని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దేశ ప్రజలకు తెలిపారు. మరోవైపు హెచ్ఎంపీవీ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తోనూ భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది.

Also Read: HMPV News: హెచ్‌ఎంపీవీ వల్ల ఎవరెవరికి ముప్పు ఉంటుంది? చిన్నారులకు సోకితే ప్రమాదమా?

చైనాలో హెచ్ఎంపీవీ విజృంభిస్తుండటంతో అక్కడి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. చైనాలో ఇన్‌ఫ్లుఎంజా A, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా COVID-19తో సహా పలు వైరస్‌లు వేగంగా వ్యప్తి చెందుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని అక్కడి ప్రజలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: HMPV : HMP వైరస్ కలకలం.. ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి సత్యకుమార్ యాదవ్

మరోవైపు 2001లో నెదర్లాండ్స్ లో మొట్టమొదటి సారిగా హెచ్ఎంపీవీ వైరస్ ను గుర్తించారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకితే.. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడపకపోవడం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎక్కువగా HMPV వైరస్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.