Congress Vs BRS : తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన వాడీవేడి వాతావరణం మరొకసారి కనిపించింది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులు వాటర్ బాటిళ్లు, కాగితాలతో గందరగోళం సృష్టించారు సభలో. ఇందులో ముఖ్యంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన అసెంబ్లీలో చేసిన గందరగోళం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి బిల్లును సభలో ప్రవేశ పెడుతున్న సమయంలో ఆయన వెనకే ఉన్న శంకర్ హావభావాలు వివాదానికి దారితీశాయి.
అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పైకి దూసుకెళ్లడం, వారిని మార్షల్స్ అడ్డగించడం జరిగాయి. ఈ కార్ రేసింగ్ పై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం సభలో గందరగోళానికి దారితీసింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్..
పూర్తి వివరాలు..