కరీంనగర్ అష్టదిగ్భందనం…ఎక్కడి వాళ్లక్కడే

  • Publish Date - March 24, 2020 / 05:19 AM IST

కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేత..ఇదంతా ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న సీన్. కరోనా రాకాసి కరీంనగర్ జిల్లాను భయపెడుతోంది. ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది.

హై అలర్ట్ కొనసాగుతోంది. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. సరిహధ్దులను మూసివేసిన అధికారులు…జిల్లాను అష్టదిగ్భందనం చేశారు. పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ రాగా..ఇతరుల వారికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. 

ఇటీవలే ఇండోనేషియా బృందం కరీంనగర్ కు వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి కరోనా పాజిటివ్ ఉందని తేలడంతో అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి కూడా వైరస్ లక్షణాలు ఉండడంతో తీవ్ర భయాందోనళలు నెలకొన్నాయి.

అందులో భాగంగా వీరు తిరిగిన ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. ముకరంపురాలో మరింత నిబంధనలు పెంచారు. బారికేడ్లను ఏర్పాటు చేసి లోపలి వారు బయటకు..బయట వారు లోనికి వెళ్లకుండా..చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచిస్తున్నారు పోలీసులు. బయటకు వచ్చిన వాహనాను సీజ్ చేస్తున్నారు. 

* స్ర్కీనింగ్ సర్వే ఓ వైపు నిర్వహిస్తూనే…పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. 
* ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాపై దృష్టి సారించారు. మంత్రి గంగుల, అధికారులను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. 

* అనవసరంగా తిరిగితే..కఠిన చర్యలు తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు.
* తీవ్రంగా హెచ్చరించి వాహనాను సీజ్ చేస్తున్న పోలీసులు. 

* కర్ఫ్యూ సడలించాకే ప్రజలు బయటకు రావాలంటున్నారు. 
* కలెక్టరేట్ ప్రాంతంలో భారీకేడ్లు ఏర్పాటు..రాకపోకలు బంద్.
* రాత్రి వేళల్లో సంచరించే వారికి పోలీసులు తమదైన శైలీలో విచారణ.
 

Read More : కరోనా వ్యాప్తి చేశారో చిప్పకూడే..కఠిన నిబంధనలు