విదేశాల్లో కంటే తెలంగాణలో కరోనాకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు.
విదేశాల్లో కంటే తెలంగాణలో కరోనాకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. తాను 14 రోజుల క్రితం యూకే నుంచి వచ్చానని, జ్వరంతో గాంధీ ఆస్పత్రికి వెళ్తే కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులు మంచి సౌకర్యాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఒక గదికి కేవలం ఇద్దరిని మాత్రమే ఉంచుతున్నారని చెప్పారు. డాక్టర్లు చేసే సేవకు చేతులెత్తి మొక్కాలని, ఎవరూ వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తే కరోనా రాదని, అందరూ తమ బాధ్యతగా ఇళ్లళ్లోనే ఉండాలని చెప్పారు.
తెలంగాణలో శనివారం (మార్చి 28, 2020) మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య ఏమీ లేవు అనుకున్న తరుణంలో ఇంతకముందే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆరు పాజిటివ్ కేసులున్నట్టుగా ప్రకటించారు. కొద్ది సేపటి క్రితమే మరో రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి పేరు మీద ప్రకటించారు. అయితే ఇవాళ రాష్ట్రంలో మొత్తం 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
దీంతో తెలంగాణ ఇప్పటివరకు మొత్తం 67 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కుత్బుల్లాపూర్ కు సంబంధించి నాలుగు కేసులు, ఓల్డ్ సిటీకి సంబంధించి నిన్న ఆరు కేసులు, నాంపల్లికి సంబంధించి ఇవాళ నాలుగు పాజిటివ్ కేసులు నమోదైన్లట్లు ప్రకటించారు. అయితే ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న క్రమాన్ని చూస్తే ఢిల్లీ నుంచి వచ్చిన ట్రావెల్ హిస్టరీ ఉన్న రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు కాంటాక్టు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఉంది. కాంటాక్టు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.