Pocharam Srininivas Corona : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా

నిన్న స్వల్ప లక్షణాలు కనిపించడంతో పోచారంకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఎలాంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

Corona positive for Pocharam Srinivas Reddy : తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజు రోజు భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఇద్దరు టీఆర్ఎస్ నేతలకు కరోనా సోకింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా రెండోసారి సోకింది. రెండు నెలల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చికిత్స పొంది ఆయన కోలుకున్నారు.

నిన్న స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఎలాంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరారు. గత కొంత కాలంగా తనను కలిసిన వారితో పాటు సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకుని, తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Vinod Kumar : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు : వినోద్ కుమార్

అలాగే ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కూడా కరోనా బారిన పడ్డారు. స్పల్ప లక్షణాలతో బాధపడుతూ ఉండగా పరీక్షలు చేయగా, పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. తనను వారం రోజులుగా కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

రాష్ట్రంలో నిన్న 1,963 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులు గుర్తించారు. శనివారం 53వేల 073 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు