Vinod Kumar : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు : వినోద్ కుమార్
కరీంనగర్ కు సింథటిక్ ట్రాక్ తీసుకువచ్చామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పింఛన్ విషయంలో బండి సంజయ్ తప్పుగా మాట్లాడుతున్నారు.

Vinod Kumar
Planning Commission Vice President Vinod Kumar : కరీంనగర్ లో క్రీడా అభిమానులు చేసిన సూచన మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. బీజేపీ తరపున నలుగురు గెలిశారని పేర్కొన్నారు. ఒక్క పైసా కేంద్రం నుంచి తీసుకురాలేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తేవాల్సిన బాధ్యత వారిదేనని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ‘తెలంగాణ అభివృద్ధిని చూడండి… మీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూడండి’ అని పేర్కొన్నారు. ఎస్బీఐ నివేదికలో తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల్లో ఉందని ప్రకటించిందని వెల్లడించారు.
Minister Gangula : రాబోయే రోజుల్లో టూరిజం స్పాట్ గా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ కు సింథటిక్ ట్రాక్ తీసుకువచ్చామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పింఛన్ విషయంలో బండి సంజయ్ తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక అనవసరంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.