Corona Restrictions : తెలంగాణలో మరోసారి కరోనా ఆంక్షలు ? క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై సస్పెన్స్‌

తెలంగాణలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. జనమంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కం చెబుదామనుకుంటున్న వేళ.. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది.

Telangana

Corona restrictions in Telangana : తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..? పండుగల వేళ నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందా..? క్రిస్మస్‌.. న్యూ ఇయర్‌ వేడుకలకు టీ సర్కార్‌ బ్రేక్‌ వేస్తుందా..? సౌతాఫ్రికా వేరియంట్ మహమ్మారిలా విరుచుకుపడుతుండటంతో.. పండుగల వేళ.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తుందా..? అనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. తెలంగాణలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. జనమంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కం చెబుదామనుకుంటున్న వేళ.. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది. ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతుండటంతో.. వేడుకలు వద్దని.. ఆంక్షలు పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ గౌరవిస్తామంటోంది. తెలంగాణను ఒమిక్రాన్‌ వణికిస్తుండటంతో.. కేబినెట్‌ భేటీ తర్వాత.. ఆంక్షలపై కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయనుంది.

రెండేళ్లుగా జనం న్యూ ఇయర్‌ వేడుకలకు దూరందూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కాస్త రిలాక్స్‌ ఫీలై.. సంబురాలు చేసుకుందామనుకుంటున్న సమయంలో.. ఒమిక్రాన్‌ రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 38 ఒమిక్రాన్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏకంగా 14 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రస్తుతం భయం భయంగానే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పరిస్థితి.

Omicron Death : జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు

గడచిన రెండేళ్లుగా సంబురాలకు దూరమైన ప్రజలు.. ఈ సారైనా ఘనంగా జరుపుకోవాలనుకుంటే.. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌ పుట్టి ముంచడానికి రెడీ అయిపోయింది. దీంతో.. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు పెట్టేశాయి. సంబరాలు వద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆంక్షలు విధించాల్సిందేనంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే క్రిస్మస్, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్‌ ఉధృతిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆంక్షలు విధించాల్సిందేనని ఆదేశించింది. హైకోర్టు సూచనల మేరకు పండుగలు, అన్ని రకాల ఈవెంట్స్‌, మతపరమైన వేడుకలు, పొలిటకల్‌, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌కు సంబంధించి సభలు, సమావేశాలపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది

Letter To KRMB : కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మరో లేఖ

తెలంగాణ మాత్రమే కాదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలవైపే అడుగులు వేసేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే ఒమిక్రాన్‌కు హాట్‌స్పాట్‌గా మారాయి మహారాష్ట్ర, ఢిల్లీ. అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించే అవకాశముంది.

ఇదే బాటలో నడిచేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఒమిక్రాన్‌ కట్టడికి ఆంక్షలు విధించాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు. హైకోర్టు ఆర్డర్‌ కాపీ తమకు ఇంకా అందలేదని.. అది అందిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు.