Cyber Crime : సైబర్ క్రైమ్ వలలో చిక్కిన ప్రొబేషనరి ఐపీఎస్.. న్యూడ్ కాల్ రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేసిన యువతి

ప్రొబేషనరీ ఐపీఎస్ కి వచ్చిన వీడియో కాల్ తో గందర గోళం ఏర్పడింది. తనకు వచ్చిన వీడియో కాల్ ను ప్రొబేషనరీ ఐపీఎస్ లిఫ్ట్ చేశారు.

Cyber Criminals Cheating

Cyber Crime – woman video call record : సైబర్ క్రైమ్ వలలో ప్రొబేషనరి ఐపీఎస్ చిక్కారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరి ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ప్రొబేషనరి ఐపీఎస్ కి వాట్సాప్ ద్వారా యువతి పరిచయం ఏర్పడింది. యువతి న్యూడ్ కాల్ రికార్డ్ చేసి ఐపీఎస్ కి పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ప్రొబేషనరి ఐపీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రొబేషనరీ ఐపీఎస్ కి వచ్చిన వీడియో కాల్ తో గందర గోళం ఏర్పడింది. తనకు వచ్చిన వీడియో కాల్ ను ప్రొబేషనరీ ఐపీఎస్ లిఫ్ట్ చేశారు. అవతల వీడియో కాల్ లో యువతి నగ్నంగా కనపడింది. నగ్న వీడియో కాల్ చూసి వెంటనే ప్రొబేషనరీ ఐపీఎస్ కట్ చేశారు.

Urfi Javed : పొద్దున్నే రోడ్డు మీద ఉర్ఫి జావేద్ ని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు..

అప్పటికే యువతి వీడియో కాల్ రికార్డ్ చేసింది. తర్వాత సైబర్ నేరగాళ్లు నగ్న వీడియో కాల్ ను ప్రొబేషనరీ ఐపీఎస్ కి పోస్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.