Cyclone Tauktae : హైదరాబాద్ లో వర్షం..కూలిన విద్యుత్ స్థంభాలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. అల్లకల్లలో సృష్టిస్తోంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

Hyderabad : అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. అల్లకల్లలో సృష్టిస్తోంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ ఉదయం గుజరాత్ లోని పోరుబందర్ – మహువా ప్రాంతాల మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ పేర్కొంది.

దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే..2021, మే 16వ తేదీ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి.

అకాల వర్షాలతో మామిడి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. శేరిలింగంపల్లిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, ఫిల్మ్ నగర్, మాదాపూర్., హైటెక్ సిటీ మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read More : Lockdown Extended : హర్యానాలో లాక్ డౌన్ పొడిగింపు

ట్రెండింగ్ వార్తలు