Lockdown Extended : హర్యానాలో లాక్ డౌన్ పొడిగింపు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానాలో లాక్‌డౌన్‌‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.

Lockdown Extended : హర్యానాలో లాక్ డౌన్ పొడిగింపు

Haryana Lockdown Extended By A Week

Updated On : May 16, 2021 / 5:01 PM IST

Haryana కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానాలో లాక్‌డౌన్‌‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. హర్యానాలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మే-24 వరకు పొడిగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమలు చేస్తున్న కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.

శాంతిభద్రతలు, ఎమర్జెన్సీలు, మున్సిపల్ సేవలు, కోవిడ్ పనుల్లో నిమగ్నమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. హర్యానాలో లాక్‌డౌన్‌ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత మే- 3నుంచి మే-10వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత మే-17 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇప్పుడు మరోసారి మే-24వరకు లాక్ డౌన్ పొడిగించారు.

ఇక,హర్యానాలో కొత్త కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం రాష్ట్రంలో కొత్తగా 9676 కేసులు,144కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 6,85,312కి చేరిందని,మరణాల సంఖ్య 6546గా ఉందని హర్యానా ఆరోగ్యశాఖ ప్రకటించింది. రికవరీ రేటు 85.04శాతంగా ఉండగా..పాజిటివిటీ రేటు 8.36గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 95,946యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి,