Danam Nagendar: హైడ్రా కూల్చివేతలపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు..

మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా అని దానం నాగేందర్ ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అని గుర్తుచేశారు.

Danam Nagender

Danam Nagender Key Comments On Hydra: హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదంటూ కామెంట్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలపై నిజనిర్దారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కొరతానని దానం అన్నారు. కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని, కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులు హైడ్రా ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదని దానం నాగేందర్ అభిప్రాయ పడ్డారు.

Also Read : Hydra Demolishing: హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా అని దానం నాగేందర్ ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అని గుర్తుచేశారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మీషన్ ఇచ్చారని దానం నాగేందర్ ఆరోపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని దానం నాగేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు అవగాహన ఉన్న వ్యక్తి.. ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించడం సరియైన విధానం కాదని సూచించారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసని దానం వ్యాఖ్యానించారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని తాను కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని దానం హామీ ఇచ్చారు.