ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు కోర్టు నోటీసులు.. జూన్ 3న ఏం జరగనుంది?

రూ.45 కోట్లు హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని చెప్పారు.

Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవిత, చన్ ప్రీత్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరికీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

మనీలాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన 6వ అనుబంధ ఛార్జ్ షీటును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మే 10న దాఖలు చేసింది. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. జడ్జి కావేరీ బవేజా విచారణ జరిపారు. అనుబంధ ఛార్జ్ షీటులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురికి (కవిత, చన్ ప్రీత్, మరికొందరు) కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కవిత, చన్ ప్రీత్ ను అరెస్ట్ చేశారు కనుక.. అరెస్ట్ కాని మిగతా ముగ్గురికి (దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్) నోటీసులు జారీ చేసి కోర్టులో హాజరుకావాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు.

దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్, అరవింద్ సింగ్.. వీరంతా హవాలా రూపంలో గోవాకు డబ్బు తరలించడంలో సహాయకారులుగా ఉన్నారు, లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకుగాను సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాథ్ ద్వారా అందించారని, అందులో 45 కోట్ల మొత్తాన్ని హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని చెప్పారు.

కవిత 100 కోట్ల ముడుపులు సమకూరిస్తే, ఆ 100 కోట్లలో కొంత మొత్తాన్ని గోవాకు తరలించడంలో చన్ ప్రీత్, దామోదర్ శర్మ, అరవింద్ సింగ్, ప్రిన్స్ కుమార్.. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు చేయడంలో పాత్రధారులుగా ఉన్నారని, వారందరికీ కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. కవితను మార్చి 16న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ఆమె పై కోర్టులో ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జ్ షీటులో కవితను కింగ్ పిన్ గా దర్యాఫ్తు సంస్థలు పేర్కొన్నాయి. కవిత కీలక సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నారని దర్యాఫ్తు సంస్థలు వెల్లడించాయి.

Also Read : నిన్ను చంపేస్తాం..! బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్

ట్రెండింగ్ వార్తలు