నిన్ను చంపేస్తాం..! బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్

ధర్మం కోసం పని చేస్తే నిన్ను, నీ ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు. నాకు త్రెట్ కాల్స్ వస్తున్నాయని మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, తెలంగాణ డీజీపీకి లేఖలు రాశాను.

నిన్ను చంపేస్తాం..! బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్

Raja Singh : బీజేపీ నేత, గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దుండగులు.. చంపేస్తాం అంటూ కాల్ చేసి బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. +66, +85, +88 ,+75 +25, ప్రైవేట్ నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్లను రాజాసింగ్ విడుదల చేశారు. కాగా, తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కొత్త కాదన్నారు రాజాసింగ్. దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఈ పరిస్థితిని పోలీసు శాఖకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నా అని అన్నారు.

”నాకు కాల్ చేసి బెదిరిస్తున్న దుండగులకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చా. గతంలో అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాకు ఉదయం నుండి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నీకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పాలంటూ అడిగిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చాను. కనీసం సీఎంకు కాల్ చేసి బెదిరిస్తేనైనా పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారంటూ బెదిరిస్తున్నారు. ధర్మం కోసం పని చేస్తే నిన్ను, నీ ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు. నాకు త్రెట్ కాల్స్ వస్తున్నాయని మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, తెలంగాణ డీజీపీకి లేఖలు రాశాను” అని రాజాసింగ్ వెల్లడించారు.

Also Read : మార్పులపై రగడ.. జయ జయహే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు.. మళ్లీ కంపోజ్ చేయించడంపై వివాదం