MLC Kavitha : కవిత ఈడీ విచారణలో కీలక ట్విస్ట్, అధికారుల చేతిలో ఫోన్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో భాగంగా కవిత ఫోన్ ను ఈడీ అధికారులు అడిగారు. అయితే, తన ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వచ్చానని కవిత చెప్పారు. తర్వాత సిబ్బందిని పంపించి తన ఫోన్ తెప్పించారు కవిత.(MLC Kavitha)

MLC Kavitha : కవిత ఈడీ విచారణలో కీలక ట్విస్ట్, అధికారుల చేతిలో ఫోన్

Updated On : March 11, 2023 / 6:27 PM IST

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ట్విస్ట్ ఇచ్చింది. విచారణ సమయంలో కవిత సెల్ ఫోన్ గురించి ఈడీ అధికారులు అడిగారు. అయితే, తన ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వచ్చానని కవిత సమాధానం చెప్పారు. దీంతో ఈడీ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని పంపించి మరీ కవిత ఫోన్ తెప్పించారు.

ప్రస్తుతం కవిత ఫోన్ ఈడీ అధికారుల చేతిలో ఉంది. ఫోన్ ను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోన్లను మార్చడం గురించి ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. 2021-22 లో లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో 10 ఫోన్లను మార్చారు కవిత. దీని గురించి అధికారులు ఆరా తీశారు. ఎందుకు ఫోన్లు మార్చారో చెప్పాలన్నారు. ఇక, సమీర్ మహేంద్ర చార్జ్ షీట్ లోనూ కవిత ఫోన్లను మార్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

Also Read..Delhi Liquor Scam MLC kavitha : తండ్రి కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి ఆమె విచారణ కొనసాగుతోంది. ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఆమెను విచారిస్తోంది.

Also Read..Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

మరోవైపు ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఆమెను అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ కూడా పెరుగుతోంది. కవితను అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆప్ శ్రేణులతో కలిసి వీరు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ ముందు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ ఈడీ ఆఫీసు లోపలికి ప్రవేశించారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లేటపుడు.. కవిత పిడికిలి బిగించి జై కొట్టి వెళ్లారు. కవిత వెనకాలే ఈడీ ఆఫీసు గేట్ వరకూ వచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు. అటు ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.(MLC Kavitha)

కవిత మినహా.. వేరే ఎవరినీ లోనికి అనుమతించలేదు ఢిల్లీ పోలీసులు. ఈడీ ఆఫీసు చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. కవిత వెంట వచ్చిన భర్త అనిల్, అడ్వొకేట్లను కూడా పోలీసులు బయటే నిలిపివేశారు. అటు ఈడీ ఆఫీసు, ఇటు కేసీఆర్ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో నాయకులు గుమిగూడారు.

Also Read..Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్

ఇటు కవితతో పాటు 9 మందిని ఒకేసారి ఈడీ ప్రశ్నిస్తోంది. కవితతో పాటు మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేశ్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లను ఈడీ ఒకేసారి విచారిస్తోంది.(MLC Kavitha)