Building Demolition : బహదూర్ పురలో పక్కకి ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్న మాలిక్ ట్రేడింగ్ డెమోలిషన్ కంపెనీ

సికింద్రాబాద్ లో డెక్కన్ మాల్ ను కూల్చిన కంపెనీకే ఈ బిల్డింగ్ కూల్చివేత పనులను అప్పగించారు. కూల్చివేత ఖర్చులను భరించాలని యజమానికి జీహెచ్ఎంసీ ఆదేశించింది.

Bahadurpura Building Demolition

Bahadurpura Building Demolition : హైదరాబాద్ లోని బహదూర్ పురలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పక్కకి ఒరిగిన విషయం తెలిసింది. పక్కకి ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మాలిక్ ట్రేడింగ్ డెమోలిషన్ కంపెనీ ఆధ్వర్యంలో బిల్డింగ్ కూల్చివేత పనులు సాగుతున్నాయి. డెక్కన్ మాల్ ను కూల్చిన భారీ యంత్రంతో బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. కూల్చివేతలో మొదటి గంట అత్యంత కీలకంగా మారింది.

మొదటి గంట తర్వాత సజావుగా కూల్చివేత పనులు సాగుతున్నాయి. చుట్టూ ఉన్న ఏడు భవనాల్లోని 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. హై రీచ్ బూమ్ వెహికల్ తో కింది నుంచే నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. నాలుగో అంతస్తును కాంబి క్రషర్ తో రీచ్ బూమ్ వెహికిల్ కూల్చివేస్తంది. అదుపు తప్పితే మొత్తం బిల్డింగ్ కుప్పకూలే ప్రమాదం ఉంది.

Hyderabad : బాబోయ్.. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం, భయాందోళనలో జనం

బిల్డింగ్ కూల్చివేత పనులు 24-48 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ లో డెక్కన్ మాల్ ను కూల్చిన కంపెనీకే ఈ బిల్డింగ్ కూల్చివేత పనులను అప్పగించారు. కూల్చివేత ఖర్చులను భరించాలని యజమానికి జీహెచ్ఎంసీ ఆదేశించింది. బిల్డింగ్ కూల్చివేతకు రూ.27 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే బిల్డింగ్ యజమాని రూ.7 లక్షలు చెల్లించారు. బహదూర్ పురాలో నిర్మాణంలో ఉండగానే నాలుగు అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది.