×
Ad

Bhatti Vikramarka : సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధం.. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్ అల్లుడే: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : తెలంగాణ ఆత్మ సింగరేణిపై కొన్ని కట్టుకథలు, లేఖలతో అపోహలు సృష్టిస్తున్నారని.. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.

Bhatti Vikramarka

Bhatti Vikramarka : తెలంగాణ ఆత్మ సింగరేణిపై కొన్ని కట్టుకథలు, లేఖలతో అపోహలు సృష్టిస్తున్నారని.. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధమని తెలిపారు.

Also Read : Gali Janardhan Reddy : బళ్లారిలో టెన్షన్ టెన్షన్.. గాలి జనార్దన్ రెడ్డి ఇల్లు తగలబెట్టిన దుండగులు

కొందరు తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు. సింగరేణికి కూడా నష్టం చేస్తున్నారు. సైట్ విజిట్ కండిషన్ తొలిసారి పెట్టారని ఓ పత్రికలో కథనం రాశారు. ఆ కథనం రాగానే ఒకాయన లేఖ రాశారు.. ఇంకోగాయన స్పందించారు. వరుస ఎపిసోడ్స్ వెనుక ఆంతర్యం ఏమిటి..? అంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

కనీసం అవగాహన లేకుండా రాసిన కథనంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రావడం.. కిషన్ రెడ్డి విచారణ మొదలు పెట్టడం మంచిదయ్యిందని భట్టి అన్నారు. కిషన్ రెడ్డి విచారణను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. కొందరి ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ల అన్ని విషయాలు బయటకు రావాలని భట్టి అన్నారు.

సింగరేణి నుంచి ఏ నిర్ణయంపై మంత్రి వద్దకు ఫైల్స్ రావని, సింగరేణి స్వతంత్ర బాడీ అని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. 105 ఏళ్ల నుంచి నడుస్తున్న స్వతంత్ర సంస్థ సింగరేణి. సింగరేణి, కోల్ ఇండియా నిబంధనల్లో సైట్ విజిట్ మ్యాండిటరీ అని నిబంధన పెట్టింది . ఒక్క సింగరేణి‌లోనే కాదు NMDC‌లో కూడా సైట్ విజిట్ నిబంధన ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సంస్థనే కదా..? రైల్వే, హింధుస్థాన్ కార్పొరేషన్‌లో కూడా సైట్ విజిట్ తప్పని సరి నిబంధన ఉంది. గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీలలో కూడా సైట్ విజిట్ తప్పని సరి నిబంధన ఉంది. గుజరాత్ కూడా ఈ దేశంలోనే ఉంది కదా..? నవరత్న సంస్థలకు సంబంధించి కేంద్రం టెండర్లకు ముందు సైట్ విజిట్ ఉందని రూల్ ఉంది. మినిస్ట్రీస్ ఫైనాన్స్, సైనిక్ స్కూల్, డిఫెన్స్.. Hpcl ఇలా ప్రతి టెండర్లకు ముందు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉండాలని కేంద్రం నిబంధన పెట్టిందని భట్టి విక్రమార్క అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సైట్ విజిట్ నిబంధనకు సంబంధించిన ఆధారాలను భట్టి విక్రమార్క సూచించారు. కాంట్రాక్టర్ తప్పని సరిగా సైట్ విజిట్ సర్టిఫికెట్ దాఖలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం నిబంధన అని భట్టి అన్నారు.

అసలు హరీశ్ రావుకు ఏం కావాలి..? ఎంక్వెరీ కావాలంటే హరీశ్ రావు నాకే లేఖ రాయొచ్చు కదా. 12ఏళ్లలో జరిగిన టెండర్లపై ఎంక్వెరీ జరపాలా..? తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపైనా దర్యాప్తు చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే చర్చించి విచారణకు ఆదేశిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.