Rajanna Sirisilla : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి దసరా వరకు కొనసాగుతాయి.

Devi Navaratri celebrations : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి దసరా వరకు కొనసాగుతాయి. ఇందుకుగానూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటిరోజు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి గురువారము శైలపుత్రి అలంకారముతో హంస వాహనం దర్శనం ఇవ్వనున్నారు.

రెండవ రోజు ఆశ్వీయుజ శుద్ధ విదియ శుక్రవారము ‘బ్రహ్మచారిణి అలంకారముతో నెమలి వాహనం పై దర్శనం. మూడవ రోజు ఆశ్వీయుజ శుద్ధ తదియ శనివారము చంద్రఘంటపై అలంకారముతో దర్శనం ఇస్తారు. నాల్గవ రోజు ఆశ్వీయుజ శుద్ధ చవితి ఆదివారము కూష్మాండ అలంకారముతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై.. నేటి నుంచి దసరా శరన్నవరాత్రులు

ఐదవ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి ఉపరి షష్టి సోమవారము స్కందమాత అలంకారముతో కనిపించనున్నారు. ఆరవ రోజు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి మంగళవారము కాత్యాయని అలంకారముతో దర్శనం ఇస్తారు. ఏడవ రోజు ఆశ్వీయుజ శుద్ధ అష్టమి బుధవారము (దుర్గాష్టమి), కాళరాత్రి అలంకారముతో నెమలి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఎనిమిదవ రోజు (మహర్నవమి) గురువారము మహాగౌరీ అలంకారము తో ధర్మగుండము నందు తెప్పోత్సవముపై దర్శనం ఇస్తారు. తొమ్మిదవ రోజు శుక్రవారము.. (విజయదశమి) దసరా సిద్ధిదా (శ్రీ మహాలక్ష్మీ) శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారము గజవాహనములపై అంబారీ సేవతో భక్తులకు దర్శనం ఇస్తారు.

ట్రెండింగ్ వార్తలు