Sankepally Sudheer Reddy
Dharani portal canceled : కేసీఆర్ పాలమూరు ఎంపీగా పోరాడితే తెలంగాణ రాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి సంకేపల్లి సుధీర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎంగా పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం కాళేశ్వరం పేరుతో డబ్బులు వృధా చేశారని విమర్శించారు.
ఒక్క ఎకరా కూడా అదనంగా సాగులోకి రాలేదని పేర్కొన్నారు. ఎక్కడ నీళ్ళు కనబడినా .. ఇవి కాళేశ్వరం నీళ్ళు అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ 60 శాతం బాగాలేదన్నారు. ధనికులకు, పెత్తందారుకు మాత్రమే ధరణి బాగుందని తెలిపారు.
Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్
ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. ధరణిపై ప్రజా దర్బార్ నిర్వహించి అడగండి .. ప్రజలు చెబుతారు అని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి రద్దు చేస్తామని పేర్కొన్నారు. ధరణి లేకుంటే .. రైతుబంధు రాదు, రైతు బీమా రాదు.. అంటూ కేసీఆర్ రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాలు అన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.