×
Ad

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇలాంటి కామెంట్స్‌ ఎందుకు చేశారు?

ఆ నేతలను దృష్టిలో పెట్టుకునే అరవింద్ ఇలా మాట్లాడి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  • బీజేపీలో హాట్ టాపిక్‌గా ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు
  • సీనియర్లను ఉద్దేశించి అరవింద్ సీరియస్ కామెంట్స్
  • సొంత పార్టీకి మోసం చేస్తున్నారంటూ అరవింద్ చురకలు

ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. సీనియర్లను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ చర్చకు తీశాయి. ఏ ఇద్దరు బీజేపీ నేతలు కలిసిన ఇప్పుడు ఇదే అంశంపైన చర్చించుకుంటున్నారు. అరవింద్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎంపీ అరవింద్ మెట్‌పల్లి సీనియర్ నేత సురేందర్ గౌడ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వెనుక మరో కోణం ఉందని కూడా అనుకుంటున్నారు.

ఇప్పటికే ఇందూర్‌ను క్లీన్ చేశాను..జగిత్యాలను కూడా క్లీన్ చేస్తున్నాను. బీజేపీలో 30, 40 ఏళ్ల నుంచి జెండా మోస్తున్నామంటూ పార్టీని మోసం చేసేవారు ఏ స్థాయిలో ఉన్న వెళ్లిపోవాలంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇతర పార్టీలతో ములాఖత్ అయి సొంత పార్టీకి మోసం చేస్తున్నదెవరు.? అరవింద్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీలో వీక్‌గా ఉన్నవారికి టికెట్లు ఇవ్వడం ద్వారా ఇతర పార్టీల గెలుపునకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా చేశారు అరవింద్.

Also Read: పాలకొండలో జనసేన ఎమ్మెల్యే Vs టీడీపీ ఇంచార్జ్..! ఇప్పుడెలా?

కొంతమంది సీనియర్లను ఉద్దేశించి అరవింద్ అలా మాట్లాడారని జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారే పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారనేది అరవింద్ ఆరోపణ అంటున్నారు.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు అనుకూలంగా లీడర్స్‌!
కొద్దిమంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల లీడర్స్ బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే..మరికొంతమంది ఉత్తర తెలంగాణ లీడర్స్ ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూలంగా నడుచుకుంటున్నారని పార్టీలోనే చర్చ నడుస్తోందట.

ఆ నేతలను దృష్టిలో పెట్టుకునే అరవింద్ ఇలా మాట్లాడి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ప్రయత్నాలు చేస్తున్న నేతలకు అరవింద్ చేసిన వాఖ్యలు గట్టిగా తాకి ఉంటాయని అనుకుంటున్నారట.

ఇప్పటికైనా ఆ నేతలు ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం మానేస్తే బీజేపీ బలపడుతుందని భావిస్తున్నారట కట్టర్ బీజేపీ లీడర్లు. అయితే ఇంతకు అరవింద్ ఎవరిని ఉద్దేశించి అన్నట్లు అంటే..పిల్లి మెడలో గంట కట్టేందుకు మాత్రం బీజేపీ నేతలు జంకుతున్నారట. ఏదో రోజు అరవిందే పూర్తిగా బరస్ట్ అయి సొంత పార్టీకి మోసం చేస్తున్నవారి పేర్లు కూడా బయటపెడుతారని..వెయిట్ అండ్ సీ అంటూ దాటేస్తున్నారట పలువురు కమలనాథులు.