Dharmapuri Arvind: కవిత జైల్లోకి వెళ్తే మేము పంపినట్లు, బయటకు వస్తే మేమే తీసుకొచ్చినట్లా?: బీజేపీ ఎంపీ అర్వింద్ 

"మొదట కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు.. అరెస్ట్ చేయాలని అన్నారు. బీఆర్ఎస్‌తో కుమ్ముక్కు అయిపోయారని అన్నారు" అని చెప్పారు.

Arvind on Kavitha case

Arvind Dharmapuri: ఢిల్లీ లిక్కల్‌ స్కాంలో గతంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, లోక్‌సభ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ “10టీవీ వీకెండ్‌ విత్ అర్వింద్” ప్రోగ్రాంలో అర్వింద్ మాట్లాడారు.

“మొదట కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు.. అరెస్ట్ చేయాలని అన్నారు. బీఆర్ఎస్‌తో కుమ్ముక్కు అయిపోయారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో నష్టపోయాం. ఆ తర్వాత కవితను అరెస్టు చేయాల్సిన అవసరం దర్యాప్తు అధికారులకు వచ్చింది. జైల్లోకి వెళ్తే మేము పంపినట్లు, బయటకు వస్తే మేమే తీసుకొచ్చినట్లా?

Also Read: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ నుంచి మేము వెళ్లగొట్టలేదు: ఎంపీ అర్వింద్

లోక్‌సభ ఎన్నికల్లో మేము ఇంకా సరిగ్గా హోమ్ వర్క్ చేసుకుని ఉంటే 12 సీట్లు గెలిచేవాళ్లం. కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తుంటే ఇక్కడ కాళేశ్వరం విచారణను సీఎం రేవంత్‌ రెడ్డి సీబీఐకి ఎందుకు ఇస్తున్నారన్న విషయంపై ఎంపీ అర్వింద్ స్పందించారు.

“కాళేశ్వరంపై రేవంత్‌ రెడ్డి రెండు ఏళ్లు దాటాక సీబీఐ విచారణకు ఎందుకు సిఫార్సు చేశారు? కమిషన్ వేసుకున్నారు.. రిపోర్టు కూడా ఎప్పుడో వచ్చింది” అని అన్నారు.

“ఈ దేశంలో కాళేశ్వరం ఫస్ట్ స్కామ్ కాదు.. లాస్ట్ స్కామ్ కాదు. యూపీఏలో కూడా చాలా స్కాములు జరిగాయి. తప్పు చేయకపోతే జైలుకి వెళ్లరు.. ఆరోపణలు గట్టిగా ఉంటేనే జైలుకి వెళ్తారు” అని అన్నారు.