Video: పసుపు ప్యాకెట్లలో గంజాయి.. ఇలా గుర్తించిన అధికారులు

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Excise Officials: పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వారు రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ అధికారులు వారి ఆటలను కట్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని దూల్ పేటకు చెందిన నేహా అనే మహిళ పసుపు ప్యాకెట్లు తయారీ కేంద్రాన్ని పెట్టుకుంది.

అయితే, పసుపు ప్యాకెట్లలో పసుపు కాకుండా గంజాయి పెట్టి అమ్ముతోంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు దీనిపై సమాచారం అందడంతో నిఘా పెట్టి దాడి చేసింది. దీంతో ఆ మహిళ అధికారులకు దొరికపోయింది. పైకి అట్లాస్ టర్నరిక్ పౌడర్ పేరుతో ఉన్న ఆ ప్యాకెట్లను అధికారులు విప్పి చూడగా అందులో గంజాయి కనపడింది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డి.ఎస్.పి తిరుపతి యాదవ్, ఎస్సై నాగరాజుతో పాటు సిబ్బంది కలిసి ఈ దాడి చేశారు. 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, నేహాను అరెస్ట్ చేశారు.

పసుపు ప్యాకెట్లలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన టీమ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు. నేరస్థులు ఎన్ని కొత్త పుంతలు తొక్కుతూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చివరకు పోలీసులకు చిక్కకతప్పదన్న సందేశాన్ని మరోసారి ఇచ్చింది ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ.

Also Read: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు.. కూనంనేని ఇలా, కడియం అలా..

 

ట్రెండింగ్ వార్తలు