పేదలు, ఉద్యోగులకు దీపావళి కానుక..! తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..!
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.

Cabinet Decisions (Photo Credit : Google)
Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. వారికి ఒక డీఏ అనౌన్స్ చేసింది. ఇక నవంబర్ 30 లోపు కులగణన పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు. పేద వాళ్లలో అతి పేద వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను దీపావళి కానుకగా ఈ నెల 31న కేటాయించనున్నట్లు తెలిపారు. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. 211 ఎకరాల భూమి అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్లు వేసేందుకు క్యాబినెట్ ఆమోదం. ఇక ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు 4 లేన్ల రహదారుల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Also Read : ఫస్ట్ అరెస్ట్ ఆయనదేనా..? దివాలీలోపు తెలంగాణలో ఏం జరగబోతోంది?