Hyderabad: భార్యను హత్యచేసి.. ముక్కలు చేసి ఉడకబెట్టిన కేసులో కీలక మలుపు.. పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్ట్..
మీర్ పేట మాధవి హత్య కేసులో డీఎన్ఏ రిపోర్ట్ పోలీసుల వద్దకు చేరింది.

meerpet incident
Hyderabad: హైదరాబాద్ మీర్ పేటలో మాజీ జవాన్ గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్యచేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు నెలల క్రితం గురుమూర్తి తన భార్యను హత్యచేసిన తరువాత ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి ఉడకబెట్టి, ఎముకలను పొడిచేసి గుర్తుతెలియని ప్రదేశాల్లో పడేసి పోలీసులకు ఆధారాలు దొరక్కుండా చేశాడు. ఈ కేసును ఛేదించడం అప్పట్లో పోలీసులకు తలనొప్పిగా మారింది. అయితే, పలుసార్లు గురుమూర్తిని విచారించిన అనంతరం పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.
గురుమూర్తి నివాసంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు బృందం తనిఖీ చేసి ఎట్టకేలకు ఆధారాలను సేకరించారు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా కేసులో గురుమూర్తిని అరెస్టు చేసిన పోలీసులు.. క్లూస్ టీం ఇచ్చిన టిష్యూస్ ను డీఎన్ఏ పరీక్ష కోసం పంపించారు. తాజాగా.. పోలీసుల వద్దకు డీఎన్ఏ రిపోర్ట్ చేరింది. మాధవి డీఎన్ఏతో.. తల్లి, పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగ రోజు భార్యను హత్యచేసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, ఎముకలను కాల్చి పొడి చేసి గురుమూర్తి చెరువులో పడేశాడు. భార్య నిత్యం విధేస్తూ డామినేట్ చేస్తుందన్న అక్కసుతో, ప్రతిచిన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వాళ్లతో చిత్రహింసలకు గురిచేస్తుందన్న కోపంతోనే గురుమూర్తి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.