KTR : కాంగ్రెస్ వస్తే ఏడాదికొక సీఎం మారడం, స్కామ్ లు గ్యారంటీ : మంత్రి కేటీఆర్

60 ఏళ్లలో చేయని పనిని తాము పదేళ్లలో చేసి చూపించామని తెలిపారు. పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

Minister KTR (4)

KTR – Congress : కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. 6 దశాబ్ధాల్లో ఏమీ చేయని వారు 6 గ్యారెంటీలతో వస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ చుట్టూ పైరవీలు చేసేవారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన వాగ్ధానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల ఆలోచించాలి.. ఆగం కావొద్దు అని సూచించారు. 24 గంటల కరెంట్ ఎక్కడుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు.. చెన్నూరుకు వస్తే కరెంట్ ఎలా వస్తుందో చూపిస్తామని చెప్పారు.

Narendra Modi: తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం: ఎన్నికల వేళ మోదీ వరాల వర్షం

60 ఏళ్లలో చేయని పనిని తాము పదేళ్లలో చేసి చూపించామని తెలిపారు. పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. చెన్నూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తామని చెప్పారు.

తెలంగాణకు ఏం ఇవ్వని మోదీ రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ ఉన్న ఆస్తులనే అమ్ముతున్నారని విమర్శించారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం పర్యటనలో మోదీ సింగరేణిని కాపాడుతా అన్నారు.. మాటిచ్చిన నెలలోనే గనుల ప్రైవేటీకరణకు వేలంపాటకు పిలిచారని విమర్శించారు.