Telangana : స్కూల్స్ రీఓపెన్‌‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

స్కూళ్ల తెరవాలనే విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం ఉదయం విచారణ జరిగింది.

Telangana : స్కూల్స్ రీఓపెన్‌‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Telangana high court

Updated On : August 31, 2021 / 2:20 PM IST

Reopen Schools Telangana : తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ రీ ఓపెన్, ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.  గురుకులాలు, విద్యా సంస్థల్లోని హాస్టళ్లను తెరవొద్దని సూచించింది. గురుకులాలు, వసతి గృహాల్లోని వసతుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపై నివేదిక ఇవ్వాలంది. రెసిడెన్షియల్, గురుకులాలు మినహా…మిగతా స్కూల్స్ లో రేపటి నుంచి (సెప్టెంబర్ 01, బుధవారం) ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని చెప్పింది.

Read More : కరోనా హాట్ స్పాట్లుగా స్కూల్స్

ఫిజికల్ క్లాసులకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని సూచించింది హైకోర్టు. డైరెక్ట్ క్లాసులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు సూచించింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఫిజికల్ క్లాసులు నిర్వహించడంపై వారంరోజులలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని తెలంగాణ విద్యాశాఖకు హైకోర్టు సూచించింది. మార్గదర్శకాలను విస్తృత ప్రచారం చేయాలని చెప్పింది.

Read More : AP Schools Reopen : ఆగస్టు 16న స్కూల్స్ పునఃప్రారంభం

దేశంలో కోవిడ్ తీవ్రత కొనసాగుతోందని, సెప్టెంబర్, అక్టోబర్ లో థర్డ్ వేవ్ పొంచి ఉందంటూ WHO హెచ్చరికలు ఉన్నాయని గుర్తు చేసింది హైకోర్టు. ఈ క్రమంలో బడులు తెరవకపోతే..విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయాలున్నాయని..ఈ రెండింటిని సమన్వయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కచ్చితంగా స్కూళ్లు తెరవాలన్న ఆదేశాలపై వారం రోజుల పాటు స్టే విధిస్తూ… తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.

Read More : Vinod Kumar Paul: ఇప్పుడే స్కూల్స్ తెరవడం మంచిది కాదు: నీతి ఆయోగ్ చైర్మన్

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూళ్లు 2021, సెప్టెంబర్ 01వ తేదీ నుంచి తెరవాలని విద్యశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్కూళ్లు తెరుచుకోవడానికి ఒక్కరోజే టైమ్‌ ఉండటం.. బడులు తెరడవంపై కోర్టు ఎలాంటీ తీర్పును ఇస్తుంది.. ఏం చెబుతుందనే విషయం అటు ప్రభుత్వంతో పాటు.. ఇటు పేరెంట్స్‌లో టెన్షన్ పెట్టింది. మరోవైపు ఆన్‌లైన్‌ వైపే ఎక్కువ శాతం మంది విద్యార్థుల పేరెంట్స్‌ మొగ్గు చూపుతున్నారు.

Read More : Schools fees : ఆ ఖర్చులు మిగులుతున్నాయిగా..Online క్లాసులకు స్కూల్స్ ఫీజులు త‌గ్గించండి : సుప్రీం ఆదేశాలు

రెసిడెన్షియల్, గురుకులాలు మినహా…మిగతా స్కూల్స్ లో సెప్టెంబర్ 01 బుధవారం ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కొవిడ్‌ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణుల హెచ్చరికలు పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో తెలిపారు. పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌ కూడా కాలేదన్నారు. అందువల్ల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరారు. హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ విద్యా శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.