రామోజీరావుకు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా?

చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు.

Ramoji Rao Passed Away

Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. రామోజీ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. రామోజీ భౌతికకాయాన్ని ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తరలించారు.

Also Read : కేంద్రంలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు?

చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తరువాత రామోజీ జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీరావుకు తన తాతయ్య రామయ్య పేరు పెట్టారు. అయితే, ఆయన బడికి వెళ్లిన సమయంలో బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో రామోజీరావు తన పేరును తానే పెట్టుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు