కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేసిన డాక్టర్

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మరచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 09:27 AM IST
కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేసిన డాక్టర్

Updated On : November 23, 2019 / 9:27 AM IST

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మరచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్వాకం మరోసారి బయటపడింది. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మరచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని భీమిని మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ నాలుగేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. చికిత్స కోసం ఆమె పలు ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరుగుతోంది.

వారం క్రితం ఓ ఆస్పత్రికి చెందిన వైద్యుడి దగ్గరకు వెళ్లి స్కానింగ్ తీసుకోగా కడుపులో ఏదో ఉందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి కుడుపులోని కాటన్ తీసివేశారు. పెద్ద ప్రమాదం తప్పింది. మహిళ ప్రాణాలతో బయట పడింది. 

2016 సంవత్సరంలో మహిళ డెలివరీ సమయంలో జిల్లా కేంద్రంలోని ఓం సాయి ఆస్పత్రి వైద్యురాలు దివ్య ఆపరేషన్ చేసి కడుపులోనే కాటన్ క్లాత్ ఉంచి కుట్లు వేసిందని బాధితురాలి భర్త తెలిపారు. ఆ డాక్టర్ పై మండిపడుతున్నారు. అతని నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.