Surgery Showing Movie Gandhi Hospital : ఎనస్తీషియా ఇవ్వకుండా, సినిమా చూపిస్తూ మహిళకు సర్జరీ..గాంధీ ఆస్పత్రి వైద్యుల అద్భుతం
గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన ఓ సర్జరీ గురించి తెలిస్తే...ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఓ మహిళా రోగికి అనస్తీషియాతో పనిలేకుండా సినిమా చూపిస్తూ సర్జరీ నిర్వహించి.... మెదడులోని కణితిని వైద్యులు తొలగించారు. అవేక్ క్రేనియటోమీగా పిలిచే ఈ సర్జరీని గాంధీ ఆస్పత్రి న్యూరో సర్జరీ విభాగం, అనస్తీషియా విభాగానికి చెందిన వైద్యులు కలిసి నిర్వహించారు.

Surgery Showing Movie Gandhi Hospital
Surgery Showing Movie Gandhi Hospital : అక్కడ ఓ సర్జరీ నిర్వహిస్తున్నారు. అదేదో ఆషామాషీ సర్జరీ కాదు. మెదడులో ఏర్పడ్డ ప్రమాదకరమైన కణితిని తొలగించే ఆపరేషన్. మరి ఆస్పత్రిలో, ఆపరేషన్ థియేటర్‌లో వాతావరణం ఎలా ఉంటుంది ? డాక్టర్లు, నర్సులు ఉరుకులు, పరుగులు…హడావిడి….స్పృహలో లేని రోగి…సర్జరీ జరిగే సమయంలో పిన్‌డ్రాప్ సైలన్స్. ఎవ్వరూ ఎవ్వరితో ఏమీ మాట్లాడకుండా….దృష్టి మొత్తం రోగిపైనా, సర్జరీ పైన ఉంచి…ఉత్కంఠ భరితంగా విధులు నిర్వహించే డాక్టర్లు, నర్సులు. సర్జరీలో మొట్టమొదగా చేసే పని…రోగికి ఎనస్తీషియా ఇవ్వడం. ఇక స్పృహ కోల్పోయిన తర్వాత రోగికి తన శరీరంపై ఏం జరుగుతుందో తెలియదు.
కత్తెర ఏ భాగాన్ని కోస్తుందో..ఏ భాగం తొలగిపోతుందో..ఎక్కడ కుట్లు పడుతున్నాయో….ఎంత రక్తం కారుతోందో….ఇవేవీ తెలియకుండానే వారికి ఆపరేషన్ పూర్తయిపోతుంది. ఇప్పటిదాకా ఏ రకమైన సర్జరీ అయినా మనకు తెలిసింది ఇదే. కానీ గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన ఓ సర్జరీ గురించి తెలిస్తే…ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఓ మహిళా రోగికి అనస్తీషియాతో పనిలేకుండా సినిమా చూపిస్తూ సర్జరీ నిర్వహించి…. మెదడులోని కణితిని వైద్యులు తొలగించారు. అవేక్ క్రేనియటోమీగా పిలిచే ఈ సర్జరీని గాంధీ ఆస్పత్రి న్యూరో సర్జరీ విభాగం, అనస్తీషియా విభాగానికి చెందిన వైద్యులు కలిసి నిర్వహించారు.
Covid Vaccine : పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి కొవిడ్ టీకాతో కోలుకున్నాడు
ముందుగా ఆ మహిళ అభిమాన నటీనటుల గురించి వైద్యులు తెలుసుకున్నారు. ఆ మహిళ చిరంజీవి, నాగార్జున అంటే ఇష్టమని చెప్పారు. చిరంజీవి అడవిదొంగ సినిమా తన ఫేవరెట్ అని తెలిపారు. దీంతో ఆ సినిమాతో పాటు…నాగార్జున నటించిన మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే సినిమా… సంతోషం చూపిస్తూ సర్జరీ నిర్వహించారు. సర్జరీ సమయంలో ఆమెకిష్టమైన పాటలు కూడా చూపించారు. న్యూరో సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ నాగరాజు, అనస్తీషియా విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవితో పాటు అనేకమంది వైద్యులు, నర్సులు, వార్డ్ బాయ్‌లు ఈ అవేక్ క్రేనియటోమీలో భాగస్వాములయ్యారు.
స్మార్ట్‌ఫోన్‌లో సినిమా ప్లే అవుతుండగా…..వైద్యులు ఆపరేషన్ మొదలుపెట్టారు. నర్సులు సినిమాకు సంబంధించి..రోగిని ప్రశ్నలు అడుగుతూ..ఆమెతో ఆహ్లాదకరంగా మాట్లాడుతుండగా….వైద్యులు ఆపరేషన్ కొనసాగించారు. ఆపరేషన్ సాగుతున్నప్పటికీ..రోగికి ఎలాంటి నొప్పీ తెలియలేదు. ఆమె సినిమా చూస్తూ..వైద్య సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రెండు గంటల పాటు ఆపరేషన్ చేయించుకున్నారు. ఓ వైపు సినిమా ప్లే అవుతుండగానే…మహిళ సమాధానాలు చెబుతుండగానే..వైద్యులు సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి చికిత్సలు విదేశాలకో లేదంటే కార్పొరేట్ ఆస్పత్రులకో పరిమితం కాదని…ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో..ఈ శస్త్రచికిత్స ద్వారా నిరూపించిన వైద్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.