Narsingi Police Station: నార్సింగి పీఎస్ నుంచి డ్రగ్స్ స్మగ్లర్ పరారీ.. కడుపునొప్పి అంటూ డ్రామాలాడి..
హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi Police Station) నుండి అంతర్జాతీయ డ్రగ్స్ నిందితుడు ముజఫర్ పరారవ్వడం తీవ్ర కలకలం రేపింది.
Drug smuggler Muzaffar escape from Narsingi Police Station.
- నార్సింగి పీఎస్ నుండి నిందితుడు పరారీ.
- బాత్రూమ్ వెంటిలేటర్ నుండి జంప్.
- ముజఫర్ కోసం ముమ్మర గాలింపు.
Narsingi Police Station: హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ నుండి అంతర్జాతీయ డ్రగ్స్ నిందితుడు ముజఫర్ పరారవ్వడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు నెల రోజుల పాటు నిఘా ఉంచిన అనంతరం ‘ఈగల్’ అధికారులు అతడిని పట్టుకుని, విచారణ నిమిత్తం నార్సింగి పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో ముజఫర్ తనకు కడుపునొప్పి వస్తోందంటూ డ్రామా ఆడాడు. అది నిజమేనని నమ్మిన పోలీసులు అతడిని విజిటర్స్ బాత్రూమ్కు తీసుకెళ్లగా, అక్కడ గ్రిల్ లేని వెంటిలేటర్ గుండా బయటకు వచ్చి, గోడ దూకి పారిపోయాడు.
TVK Party: సీఎం విజయ్ ప్రభుత్వంపై కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్.. ముగ్గురు నిందితుల అరెస్ట్
తప్పించుకున్న ముజఫర్ ప్లాన్ ప్రకారమే ఒక క్యాబ్ డ్రైవర్‌ను (Narsingi Police Station)ఆశ్రయించాడు. “నన్ను నలుగురు వ్యక్తులు కొట్టి, నా డబ్బులు, ఫోన్ లాక్కున్నారు” అని అబద్ధం చెప్పి నమ్మించి అత్తాపూర్‌లోని లెనిన్‌నగర్‌కు చేరుకున్నాడు. మార్గమధ్యంలో సదరు క్యాబ్ డ్రైవర్ ఫోన్ నుండే తన తల్లికి కాల్ చేసి అప్రమత్తం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీస్ స్టేషన్ భద్రతా లోపాలు, కనీసం బాత్రూమ్ వెంటిలేటర్‌కు కూడా గ్రిల్ లేకపోవడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముజఫర్ ముందే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని పక్కా స్కెచ్‌తోనే పరారైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులపై కూడా గతంలో డ్రగ్స్ కేసులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు ఢిల్లీకి పారిపోయి ఉండొచ్చనే అనుమానంతో హైదరాబాద్ పోలీసులు, ఈగల్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.
