Bus Accident
DTC On Karnataka BusAccident : కర్నాటకలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదంపై డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు టెన్ టీవీతో మాట్లాడారు. కర్ణాటకలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఘటనపై వివరాలను సేకరించామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్లు నిర్ధారణ అయిందన్నారు.
మిగతా వారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. కర్నాటకలో జరిగిన ప్రమాదం మైనర్ ప్రమాదమే అయినా.. బస్సులోని డీజిల్ ట్యాంకులో మంటలు అంటుకోవడంతో ఇంతటి దారుణం జరిగిపోయిందన్నారు. ప్రయాణికులు సజీవ దహనం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.(DTC On Karnataka BusAccident)
karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి
”పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ట్రావెల్ బస్సుకు ఎదురుగా వస్తున్న టెంపోను తప్పించబోయి.. బ్రిడ్జి పక్కన ఉన్న లోయలోకి బస్సు పడింది. ఆ తర్వాత బస్సు ఫైర్ అయింది. ట్రావెల్ బస్సుకు రెండు డోర్స్ ఉండడం వల్ల చాలామంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే రవాణాశాఖ అధికారులను ఘటనా స్థలానికి పంపించడం జరిగింది.
కర్ణాటక అధికారులతో ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించాము. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు స్పీడ్ లిమిట్ కచ్చితంగా పాటించాలి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు? అనేది ఇప్పుడే చెప్పలేము. ఈ ఘటనకు ఎవరు కారకులో విచారణలో తేలుతుంది” అని డీటీసీ పాపారావు అన్నారు.
Bus Accident: బస్సు ప్రమాద ఘటనలో మా సిబ్బంది తప్పిదం లేదు: ఆరెంజ్ ట్రావెల్స్
గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. చనిపోయిన వాళ్లంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అర్జున్ కుమార్ (37), అతడి భార్య (32), బివాన్ (4), దీక్షిత్ (9), అనితా రాజు (40), శివ కుమార్ (35), రవళి (30) సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు.
రెండు కుటుంబాలకు చెందిన 32 మంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని గోవా విహారయాత్రకు వెళ్లినట్టు సమాచారం. తిరుగు ప్రయాణంలో గోవా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కలబురిగి జిల్లా కమలాపురలో ఓ మినీలారీని ఢీకొట్టిన బస్సు.. కల్వర్టులో పడిపోయింది. క్షణాల్లోనే బస్సుకు మంటలంటుకుని తీవ్రరూపం దాల్చాయి.
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడు సహా 35 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బయటకు దూకేశారు. గాయపడిన మరో 12 మందిని స్థానికులు కలబురిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు.(DTC On Karnataka BusAccident)
మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టు పైనుంచి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత బస్సు డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. మంటల్లో చిక్కుకుని 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. మరో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.