karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి

కర్ణాటకలో ఈ రోజు తెల్లవారు ఝూమున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది.  కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ట్రక్క్ ను ఢీ కొటట్టంతో ఈ ప్రమాదం జరిగింది.

karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి

karnataka bus accident

Updated On : June 3, 2022 / 1:00 PM IST

karnataka bus accident  :  కర్ణాటకలో ఈ రోజు తెల్లవారు ఝూమున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది.  కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ట్రక్క్ ను ఢీ కొటట్టంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఒక బర్త్ డే పార్టీకోసం వీరంతా గోవా వెళ్లి వస్తున్నట్లు తెలిసింది.

గోవానుంచి 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ట్రక్కు ను ఢీ కొటట్టంతో బస్సులో మంటలు చెలరేగినట్లు  సమాచారం. ఈప్రమాదంలో బస్సులోని  ఎనిమిది మంది  మరణించారు. 21 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.  బస్సు పూర్తిగా కాలిపోయింది.  క్షతగాత్రులను కలబురిగిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆగి ఉన్న లారీని  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టు పైనుంచి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత బస్సు డీజిల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలింది. 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు.  ఆస్పత్రిలో మరో డ్రైవర్‌ చికిత్స పొందుతున్నాడు

Also Read : Covid-19 : భారత్‌లో కొత్తగా 4,041 కోవిడ్ కేసులు నమోదు