Eamcet Exam: ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం.. రెండు సెషన్లలో ఎగ్జామ్స్

ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9గంటలకు అగ్రికల్చర్ విభాగం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.

Eamcet Exam

Eamcet Exam: ఎంసెట్ పరీక్ష (Eamcet Exam) ప్రారంభమైంది. ఉదయం 9గంటలకు అగ్రికల్చర్ (Agriculture) విభాగం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 7.:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను అమతించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఉదయం 7గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రం వద్ద బారులు తీరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఐదురోజులు ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల వారికి, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు చెందిన ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్… లైవ్ అప్‌డేట్స్

ప్రతీరోజూ ఉదయం 9-12 గంటల మధ్య తొలి విడత, మధ్యాహ్నం 3-6 గంటల మధ్య మలివిడత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఎంసెట్ పరీక్షలకుగాను మొత్తం 3,20,292 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అగ్రికల్చర్‌కు 1,15,361 మంది. ఇంజనీరింగ్ విభాగంకు 2,05,405 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,53,935 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 94,614 మంది పరీక్ష రాయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 51,470 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంనుంచి 20,747 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.

Eamcet Exam: ఫొటో ఆధారిత ధ్రువపత్రం తప్పనిసరి.. తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి 14 వరకు ఎంసెట్

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ..

ఎంసెట్ పరీక్ష కోసం తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి వచ్చేవారు.. ఉదయం 7గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కేంద్రానికి రావాలని ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో- కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికే స్పష్టమైన సూచన చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని తెలిపారు. బయోమెట్రిక్ విధానంలో చెక్ ఇన్ ఉంటుందని, హాల్ టికెట్ తో పాటు ఏదైనా ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి ఉండదని, అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, టాటూలు, ఇతర డిజైన్లు ఏవి ఉన్న పరీక్ష హాల్లోకి అనుమతించరని వారు తెలిపారు.