CM KCR: ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు.. కేసీఆర్ క్లారిటీ!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

CM KCR: ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు.. కేసీఆర్ క్లారిటీ!

Cm Kcr

Updated On : February 1, 2022 / 9:26 PM IST

CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2018లో పరిస్థితుల కారణంగా ముందస్తుకు వెళ్లామని, ఇప్పుడు అటువంటి అవసరం లేదని అన్నారు కేసీఆర్.

ఈ అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు గతంలోనే స్పష్టత ఇచ్చినట్లు వెల్లడించారు కేసీఆర్. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని, ఎవరో కొందరు పిచ్చివాళ్లు ఈ అంశంపై చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

అయితే, అభ్యర్థులను మాత్రం ఆరు నెలలు ముందుగానే ప్రకటిస్తామని, ఎలా గెలవాలో మాకు తెలుసునని, మాకు ఎన్నికల వ్యూహాలు ఉన్నాయని, మళ్లీ అధికారంలోకి కచ్చితంగా వస్తామని అన్నారు. .

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 105సీట్లు వస్తాయని కూడా చెప్పారు కేసీఆర్. ముందస్తు ఎన్నికల భ్రమలో ఎవరూ ఉండాల్సిన పని లేదన్నారు.