EC Disqualifies : మూడేళ్ల పాటు పోటీ చేయవద్దు, బలరాం నాయక్‌‌పై అనర్హత వేటు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన..బలరాం నాయక్ పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు పోటీ చేయకుండా..ఆయనపై నిషేధం విధించింది. దీంతో ఆయన చట్టసభల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది.

Balaram Naik : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన..బలరాం నాయక్ పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు పోటీ చేయకుండా..ఆయనపై నిషేధం విధించింది. దీంతో ఆయన చట్టసభల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభ, శాసనమండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఈసీ జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నిర్ణీత గడువులోగా సమర్పించలేదు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేసింది.

ట్రెండింగ్ వార్తలు