Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న

Ramoji Rao

Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (88) కన్నుమూశారు. తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన నానక్ రామ్ గూడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. నానక్ రామ్ గూడ లోని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ సిటీకి ఆయన భౌతికాయంను తరలించారు. రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : కేంద్రంలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు?

చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. రామోజీరావు మృతిపట్ల సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామోజీతో వారికిఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

Also Read : రామోజీరావుకు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా?

రామోజీరావు ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్రవేశారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రిక అన్నదాత. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడును రామోజీరావు ప్రారంభించారు. మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి సంస్థలను స్థాపించారు. 2016లో రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. పద్మవిభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని రామోజీరావు నిర్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి రామోజీరావు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదేవిధంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి, శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి రామోజీరావు డాక్టరేట్లు అందుకున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు