Vikas Raj : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : ఎన్నికల అధికారి వికాస్ రాజ్

స్పెషల్ సమ్మరి రివిజన్ మరో వారం రోజుల్లో ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లాల్లో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు.

Vikas Raj – Telangana Election : తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ లోని బీఆర్ కే భవన్ లో మీడియా సెంటర్ ను ప్రారంభించారరు. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు.

స్పెషల్ సమ్మరి రివిజన్ మరో వారం రోజుల్లో ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లాల్లో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 3,4,5వ తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుందని వికాస్ రాజ్ తెలిపారు.

Telangana Govt : తెలంగాణలో మరో కొత్త మండలం.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు పని చేయనున్నట్లు తెలిపారు. నాలుగు వేల భనవాలను ఇప్పటికే గుర్తించామని పేర్కొన్నారు. షెడ్యూల్ విడదల అనేది కేంద్ర ఎన్నికల పరిధిలో ఉందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు