Telangana Govt : తెలంగాణలో మరో కొత్త మండలం.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు.

Telangana Govt : తెలంగాణలో మరో కొత్త మండలం.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Telangana government (3)

Telangana Govt – Mallampalle Mandal : తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. మూడు గ్రామాలతో మల్లంపల్లి మండలం ప్రాథమిక ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులకు ప్రభుత్వం 15 రోజులు గడువు ఇచ్చింది. ములుగు జిల్లా 2019 ఫిబ్రవరి 16వ తేదీన ఏర్పాటు అయింది.

జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ములుగు రెవన్యూ డివిజన ను విడ దీసి 9 మండలాలతో ప్రభుత్వం
జిల్లాలను ఏర్పాటు చేసింది. తాజాగా మల్లంపల్లిని సైతం మండలంగా ఏర్పాటు చేయనుండటంతో జిల్లాలో మండలాల సంఖ్య 10కి చేరనుంది. మల్లంప్లల్లిని మండలం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఒప్పందం ప్రకారం కవితను అరెస్ట్ చేసి రెండు నెలల్లో విడుదల చేస్తారు : రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న మల్లంపల్లి ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు.

మల్లంపల్లి ప్రజల కోరికను మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదనలు సైతం అందించి మండలంగా ఏర్పాటు చేయాలని ఒప్పించారు. మల్లంపల్లిని మండలం చేస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్న మంత్రికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.