Errabelli Dayakar Rao : జైలుకైనా పోతా.. కానీ ఆ పని మాత్రం చెయ్యను- ఎర్రబెల్లి దయాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

Errabelli Dayakar Rao : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జైలుకైనా వెళ్తాను కానీ తాను పార్టీ మాత్రం మారబోనని ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

”ప్రజల కోసం పోరాటం చేసి జైలుకెళ్లాను. మళ్లీ జైలుకి వెళ్లడానికి సిద్ధమే. నేను ఎన్నడూ తప్పు చేయలేదు. నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదు. కావాలని కొందరు బెదిరిస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచే పోరాటం చేసేందుకు నేను సిద్ధం. నేను పార్టీ మారను” అని ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చి చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకి నేరుగా సంబంధం ఉందని.. ఆయన సొంత గ్రామం పర్వతగిరిలోని ఓ ఇంట్లో కుట్రకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెబుతూనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తనపై ఆరోపణలు వెల్లువెత్తున్న తరుణంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు.

రైతుదీక్షలో పాల్గొన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను భయపడను అని అన్నారు. తాను 6సార్లు గెలిచానని, 4సార్లు చిత్తుగా ఓడిన కడియం శ్రీహరి లాంటి వ్యక్తులు తనకు అపప్రద మూటకట్టే ప్రయత్నం చేస్తున్నారని, తాను భయపడనని, కార్యకర్తలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇస్తే పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చి చెప్పారు.

Also Read : అసెంబ్లీ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుందా? చేవెళ్ల ఎంపీ స్థానంలో ముక్కోణపు పోరు

 

ట్రెండింగ్ వార్తలు