Nand Kishore Goenka University : తండ్రి జ్ఞాపకార్థం రూ.100కోట్లతో విశ్వవిద్యాలయం.. వెల్లడించిన డాక్టర్ సుభాష్ చంద్ర
Nand Kishore Goenka University : ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్, జీ మీడియా వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి శ్రీ నంద్ కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రూ.100 కోట్ల వ్యయంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Nand Kishore Goenka
- ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్, జీ మీడియా వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర కీలక నిర్ణయం
- తండ్రి జ్ఞాపకార్థం రూ.100కోట్లతో విశ్వవిద్యాలయం
- తన తండ్రి విలువలు, ఆదర్శాలు రాబోయే తరాలకు చేరవేయాలన్నదే లక్ష్యమని వెల్లడి
Nand Kishore Goenka University : ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్, జీ మీడియా వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి శ్రీ నంద్ కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రూ.100 కోట్ల వ్యయంతో 32 ఎకరాల్లో ‘శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తన తండ్రి విలువలు, సేవా భావాన్ని భావితరాలకు చేరవేయడమే ఈ విశ్వవిద్యాలయం లక్ష్యమని ఆయన తెలిపారు. పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించడంతో పాటు సామాజిక సేవ, దాతృత్వంపై ప్రత్యేక కోర్సును కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Also Read : LPG Cylinder Delivery : ఇకపై స్విగ్గీలో ఎల్పీజీ సిలిండర్.. బుకింగ్ చేసిన పది నిమిషాల్లోనే..
ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి నంద్ కిషోర్ గోయెంకా కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కాగా.. ఈ సోమవారం తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు బంధు మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య హిస్సార్‌లోని అగ్రోహా ధామ్‌లోని గోయెంకా ఉద్యానంలో జరిగాయి. అంత్యక్రియల అనంతరం తన తండ్రి పేరు చిరస్థాయిలో నిలిచేలా ‘శ్రీ నంద్ కిషోర్ గోయోంకా’ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్ సుభాష్ చంద్ర ప్రకటించారు.
నంద్ కిషోర్ గోయోంకా తన చివరి శ్వాస వరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంతో పాటుపడ్డారు. 1930 సెప్టెంబర్ 28న జన్మించిన ఆయన.. ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. మానవీయ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ముందు వరుసలో ఉన్నారు. సేవాభావంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో సుదీర్ఘకాలం ఎలాంటి ఫలితం ఆశించకుండా పనిచేశారు. వ్యాపార కుటుంబానికి చెందిన గొయెంకా… వాణిజ్య కార్యకలాపాలకు దూరంగా ఉంటూ… సామాజిక సేవకుడిగా గుర్తింపు పొందారు.
తండ్రి గొయెంకా మరణంతో డాక్టర్ సుభాష్ చంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం 32 ఎకరాల్లో రూ.100 కోట్ల వ్యయంతో ‘శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం’ నిర్మించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించనున్నారు. వచ్చే యేడాది ప్రారంభం నుంచే ఈ యూనివర్సిటీ కార్యకలాపాలు నిర్వహించేలా చేస్తామన్నారు. ఈ సందర్బంగా తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్ధులకు తన విశ్వవిద్యాలయంలో తగిన స్థానం ఉంటుందని అన్నారు.
మొత్తంగా 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో “శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం” నిర్మించనున్నట్లు డాక్టర్ సుభాష్ చంద్ర ప్రకటించారు. తన తండ్రి వారసత్వాన్ని, విలువలను రాబోయే తరాలకు అందించే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయంలో “సామాజిక సేవ మరియు దాతృత్వం” పై ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
