Etela Rajender: ఈసారి గజ్వేల్ నుంచి ఈటల పోటీ? మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శనివారం మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రస్తానం మొదలైందే గజ్వేల్ నియోజకవర్గం నుంచి అని, తెలంగాణలోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి తరహా సీన్ రిపీట్ అవుతుందని ఈటల అన్నారు.

Etaela

Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతుంది, త్వరలో బీజేపీలో భారీ చేరికలు ఉంటాయి. అందుకోసం సీక్రెట్ ఆపరేషన్ నడుస్తోంది అంటూ బీజేపీ నేత, హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియా చిట్ చాట్ లో పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలం తగ్గుతుందని అన్నారు. కేసీఆర్ ను ఢీకొట్టాలంటే.. ఈగోలు పక్కనపెట్టి లక్ష్యంకోసం పనిచేయాలని ఈటల పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధిచెబుతామని, బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి తరహా సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందని, బెంగాల్ ముఖ్యమంత్రి మాదిరిగా తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ ను ఓడించాలని అన్నారు.

Etela Rajender land scam :ఈటల భూకబ్జా నిజమేనని నిర్ధారణ..అసలు హక్కుదారులకు భూములు పంచాలని ప్రభుత్వం నిర్ణయం

నా ప్రస్తానం మెదలైందే గజ్వేల్ నుంచి అని.. అర్జునుడికి పక్షి తల మాదిరి కేసీఆర్ మాత్రమే మాకు కన్పించాలని అన్నారు. తెలంగాణ మట్టిలో ప్రశ్నించే తత్వం సహజంగానే ఉంటోందని, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని ఈటల అన్నారు.

Hyderabad Traffic Police: వాహనదారులు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల వరకు అంటే..

టీఆర్ఎస్ గ్రాఫ్ జారుడు బండ మాదిరి పడిపోతోందని, బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఆర్‌లో చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ ఈటల తెరాస పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. టీఆర్ఎస్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని, బీజేపీలో భారీ చేరికలుంటాయని, చేరికలకోసం సీక్రెట్ ఆపరేషన్ నడుస్తోందని తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు.. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయిందన్నారు. కేసీఆర్ కే టికెట్ కట్ చేయాలంటూ ఈటల అన్నారు.